Tag Archive | "prasthanam"

Tags: ,

Sharwanand’s Prasthanam in Feb second-half

Posted on 28 January 2010 by admin

శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ప్రస్థానం . వెన్నెల హిట్ తర్వాత దేవ కట్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మహేష్ శంకర్ సంగీతమంధించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోందని …. సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని, శర్వానంద్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని నిర్మాత వల్లభనేని రవి తెలిపారు. ఈ చిత్ర ట్రైలర్స్ కి మంచి స్పందన వస్తోందని, శర్వానంద్, సాయికుమార్ మధ్య వుండే సన్నివేశాలు వుత్కంతభరితంగా ఉంటాయని, దర్శకుడు దేవ కట్టా అన్నారు.

సందీప్ కిషన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. రూబీ పరిహార్ శర్వానంద్ సరసన నటిస్తోంది. వి.ఆర్.సి. మీడియా పతాకం పై శ్రీ వల్లభనేని రోశయ్య సమర్పణలో వల్లభనేని రవి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, ఫ్యామిలీతో పాటు పొలిటికల్ టచ్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. జయప్రకాశ్ రెడ్డి, జీవా, పవిత్ర, లోకేష్, సురేఖా వాణి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శ్యాం దత్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఫెబ్రవరి ద్వితియార్థం లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Related Links:

Comments (0)

Homeogenesis
Advertise Here