‘రంగ్ దే బసంతి’ వంటి హిట్ చిత్రం తరువాత హీరో సిద్దార్థ నటిస్తోన్న హిందీ సినిమా Stirker . ఈ చిత్రాన్ని Striker పేరుతోనే ఇంద్ర ఫిల్మ్స్ వారు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా లో క్యారమ్స్ ప్లేయర్ గా సిద్ధార్థ నటిస్తున్నాడు. 80 ల కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబై నేపద్యంగా కొనసాగే ఈ చిత్రాన్ని చందన్ అరోరా స్వీయ దర్సకత్వం లో రూపొందించారు. సౌత్ ఇండియన్ సెక్సీ హీరోయిన్ పద్మ ప్రియ, మరియు విద్య మల్వాడే సిద్దార్థ సరసన నటిస్తున్నారు. అనుపం ఖేర్, ఆదిత్య పంచోలి, సీమ బిస్వాస్, అంకుర్ విశాల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, ఓయ్ ఇలా దాదాపు తానూ నటించే ప్రతి చిత్రం లో కనీసం ఒక్క పాటైనా పాడుతూ తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న హీరో సిద్దార్థ, striker లోను ఒక పాట పాడి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కుడా ఉంది. ఆరుగురు ప్రముఖ సంగీత దర్శకులు ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. యువన్ శంకర్ రాజా,విశాల్ భరద్వాజ్, స్వానంద్ కిర్కేరే, శైలేంద్ర కుమార్, బ్లాజ్, అమిత్ త్రివేది, ఈ చిత్రానికి సంగీతం అందించిన వారిలో ఉన్నారు. ఈ ఆరుగురు సంగీత దర్శకులు అందించిన ఏడు పాటలకు మంచి ఆదరణ లబిస్తోంది. ఈ చిత్రానికి ‘శ్రీ’ నేపధ్య సంగీతం అందిస్తున్నారు.
ఇండియన్ ఫిల్మ్స్ సమర్పణలో, మేక్ ఫిల్మ్ ప్రొడక్షన్ – స్టూడియో 18 సహా నిర్మాణంలో చందన్ అరోరా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి చందన్ అరోరానే దర్సకత్వం వహించడం విశేషం . ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వాప్తంగా ఆత్యధిక ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నారు. ఇంద్ర ఫిల్మ్స్ వారు తెలుగు ప్రేక్షకులకి ఈ striker చిత్రాన్ని అందిస్తున్నారు.




